News October 9, 2024
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. తాజాగా ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. బహుముఖ పాత్రలకు పేరుగాంచిన మాధవన్ 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో విడుదలైన ‘మాల్గుడి డేస్’లో చివరగా నటించారు.
Similar News
News September 18, 2025
నేడు ప్రపంచ వెదురు దినోత్సవం

ఏ ప్రాంతమైనా, భూమి రకం ఎలాంటిదైనా సాగుకు అనుకూలమైన పంట వెదురు. తక్కువ పెట్టుబడితో నీటి వసతి నామమాత్రంగా ఉన్నా, ఎరువులు, పురుగు మందులతో పనిలేకుండా ఈ పంటను సాగు చేయవచ్చు. వంట చెరకుగా, వివిధ నిర్మాణాలు, ఫర్నిచర్, కళాకృతుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. వెదురు పంట రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తోంది. ఏటా సెప్టెంబర్-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు.
News September 18, 2025
BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: చైనా, పాక్

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దాని వింగ్ ‘మజీద్ బ్రిగేడ్’ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని UN సెక్యూరిటీ కౌన్సిల్‌లో చైనా, PAK జాయింట్ బిడ్ సబ్మిట్ చేశాయి. AFG అభయారణ్యాల నుంచి ఈ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరాయి. US గత నెలలో వీటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిందని.. కరాచీ ఎయిర్‌పోర్ట్, జాఫర్ ట్రైన్ హైజాక్‌లో వీటి ప్రమేయం ఉందని తెలిపాయి.
News September 18, 2025
అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.