News October 9, 2024
జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈనెల 14న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. అత్యాచారం కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News January 29, 2026
సాయుధ దళాల సేవలు ఎనలేనివి: కలెక్టర్

దేశంకోసం సాయుధ దళాలు చేస్తున్న సేవలు, త్యాగాలు ఎనలేనివని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. NGO కల్యాణ మండపంలో జరిగిన 10వ సాయుధ దళాల వెటరన్స్ డే కార్యక్రమంలో మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యులను కలెక్టర్ సత్కరించారు. సాయుధదళాలు సరిహద్దుల్లో కఠినమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నందు వలనే దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉంటున్నామని చెప్పారు.
News January 29, 2026
‘ఫేర్‌వెల్ సాంగ్’.. నా మరణానంతరమే రిలీజ్: జాకీ చాన్

కుంగ్ ఫూ స్టార్ జాకీ చాన్ తన అభిమానులతో ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన మరణం తర్వాతే విడుదల చేయాలని ఒక ప్రత్యేక పాట రికార్డ్ చేయించుకున్నట్లు తెలిపారు. బీజింగ్‌లో జరిగిన తన కొత్త సినిమా వేడుకలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ పాట ప్రపంచానికి తానిచ్చే చివరి సందేశమని ఆయన తెలిపారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో భద్రపరిచి, అభిమానులకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 29, 2026
నేతన్నలకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్

AP: మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. హ్యాండ్లూమ్ (మగ్గం)కు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ద్వారా 4 లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు. దీనివల్ల నెలకు రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.


