News October 9, 2024

హరియాణా, ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకటే: జగన్

image

AP: హరియాణా ఎన్నికలు కూడా AP తరహాలోనే జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనే బ్యాలెట్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. మనం కూడా అదే విధానానికి వెళ్లడం మంచిది. ఓటర్లలో విశ్వాసం నింపేందుకు న్యాయనిపుణులు ముందుకు రావాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News December 25, 2025

వేములవాడ భీమేశ్వరాలయంలో బ్లాక్‌లో దర్శనాల దందా

image

వేములవాడ భీమన్న ఆలయంలో బ్లాక్‌లో దర్శనాల దందా కొనసాగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. మేడారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడాన్ని ఆసరాగా చేసుకుని వరంగల్‌కు చెందిన భక్తుల వద్ద రూ.300 చొప్పున వసూలు చేసి దర్శనం కోసం తీసుకువెళ్తున్నట్లు ఆలయ SPF సిబ్బంది గుర్తించి వారిని పట్టుకున్నారు. బ్లాక్ దందాకు పాల్పడుతున్న యువకుడిని చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసిగా గుర్తించారు.

News December 25, 2025

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్‌లో ఉద్యోగాలు

image

భోపాల్‌లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్‌ 3 యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ( సాయిల్ సైన్స్/అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ అగ్రికల్చరల్ ఫిజిక్స్/ప్లాంట్ ఫిజియాలజీ), NET/GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iiss.icar.gov.in/

News December 25, 2025

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా: గడ్కరీ

image

ఇరాన్‌ పర్యటన సందర్భంగా తనకు ఎదురైన అసాధారణ అనుభవాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పంచుకున్నారు. ‘2024 జులైలో ఇరాన్ ప్రెసిడెంట్‌గా మసౌద్ ప్రమాణానికి వెళ్లా. పలువురు దేశాధినేతలతోపాటు హమాస్ చీఫ్‌(ఇస్మాయిల్ హనియే) కూడా ఉన్నారు. ఆయన్ను నేను కలిశా. కార్యక్రమం ముగిశాక హోటల్‌కు చేరుకున్నా. 4AM సమయంలో హమాస్ లీడర్ <<13758903>>చనిపోయారని<<>> చెప్పారు. దీంతో షాక్‌కు గురయ్యా’ అని ఓ బుక్ రిలీజ్ ఈవెంట్లో తెలిపారు.