News October 9, 2024

గత ముఖ్యమంత్రి నిరుద్యోగులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్

image

TG: తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామకపత్రాలు అందజేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాము 65 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామన్నారు.

Similar News

News February 2, 2026

జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

image

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు, ప్రియాంకా చోప్రా జంటగా రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ జార్జియాలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. డెరెక్టర్ రాజమౌళి దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారట. అలాగే మరో కీలక షెడ్యూల్‌ను అంటార్కిటికాలో చిత్రీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

News February 2, 2026

పెసరపిండి దీపం ఎందుకు వెలిగించాలంటే..?

image

ఇంట్లో దారిద్ర్యం తొలగి, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే పెసరపిండి దీపం వెలిగించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ దీపారాధన చేయడం వల్ల సుఖశాంతులు చేకూరుతాయి. పెసరపిండి దీపం బుధ గ్రహానికి ప్రీతికరమైనది, కాబట్టి ఇది వ్యాపార అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. నిత్యం పేదరికం వేధిస్తున్నా, సంపాదన నిలకడగా లేకపోయినా ఈ దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.

News February 2, 2026

రష్యా దాడిలో 15 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి

image

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై జరిపిన డ్రోన్ అటాక్‌లో 15 మంది మరణించారు. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని DTEK విద్యుత్ ఉత్పత్తి సంస్థ గనులపై రష్యా దాడులకు పాల్పడింది. షిఫ్ట్ ముగించుకొని బస్సులో ఇంటికి బయల్దేరిన కార్మికులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. మరోవైపు అబుదాబీ వేదికగా FEB 4,5 తేదీల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయి.