News October 9, 2024
BRS ఇక అధికారంలోకి రాదు: రేవంత్

TG: బీఆర్ఎస్ ఇక అధికారంలోకి రాబోదని సీఎం రేవంత్ అన్నారు. ‘పదేళ్లుగా ఉద్యోగాలు లేవు, బదిలీలు లేవు. మేం వచ్చిన 60 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం. విద్యారంగానికి రూ.21 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను పటిష్ఠం చేస్తున్నాం. డీఎస్సీని ఆపాలని గుంట నక్కలు, కొరివి దెయ్యాలు ప్రయత్నించాయి. తెలంగాణ సమాజం మీద కేసీఆర్‌కు ఎందుకంత కోపం’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News July 4, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో 2025 డీఏ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం 55శాతం డీఏను 59శాతానికి పెంచుతారని తెలుస్తోంది. జులై నుంచే ఈ పెంపు అమల్లోకి రానుండగా, బకాయిలు మాత్రం 2026 జనవరి 1 తర్వాతే చెల్లిస్తారని సమాచారం. రానున్న 2 నెలల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు సార్లు జనవరి, జులైలో డీఏను సవరిస్తారు.
News July 4, 2025
సిద్ధార్థ్ ‘3 BHK’ మూవీ రివ్యూ&రేటింగ్

తన తండ్రి సొంతిల్లు నిర్మించాలనే కలను హీరో నెరవేర్చాడా లేదా అన్నదానిపై ‘3 BHK’ మూవీని తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. సిద్ధార్థ్, శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ ఫరవాలేదనిపించాయి. డైరెక్టర్ శ్రీ గణేశ్ స్క్రీన్ ప్లే స్లోగా సాగింది. సాంగ్స్ అలరించలేదు. కథను ముందే ఊహించవచ్చు. కొన్ని సీన్లు పదేపదే వస్తూ సీరియల్‌ను తలపిస్తాయి. రేటింగ్: 2.25/5
News July 4, 2025
పెరుగుతున్న ట్రాఫిక్ జామ్స్.. ఏం చేయాలి?

HYDలో ‘కిలోమీటర్ దూరానికి గంట పట్టింది’ అని వే2న్యూస్‌లో పోస్ట్ అయిన <<16941177>>వార్తకు<<>> యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్కరి ప్రయాణం కోసం కార్లను వాడటం ట్రాఫిక్‌కు ప్రధాన కారణమని అంటున్నారు. కంపెనీలన్నీ ఒకే చోట ఉన్నాయని, వాటిని వివిధ ప్రాంతాలకు తరలించాలని మరికొందరు సూచించారు. మెట్రో, ఆర్టీసీ లాంటి ప్రజారవాణాకు పెద్దపీట వేయాలంటున్నారు. HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఏం చేయాలో కామెంట్ చేయండి.