News October 9, 2024

మూసీ నిర్వాసితులకు నది దగ్గర్లోనే ఇళ్లు: భట్టి

image

TG: హైదరాబాద్ మూసీ నిర్వాసితుల పునరావాసంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. మూసీ గర్భంలో నివసిస్తున్న వారిని పరివాహాకానికి దూరంగా పంపించబోమని, నది దగ్గరలోనే ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టాలు లేని వారిని కూడా ఆదుకుంటామన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు మేలు కలిగే సూచనలు ఇవ్వాలన్నారు.

Similar News

News October 10, 2024

ప్రిడేటర్ డ్రోన్స్, అణు సబ్‌మెరైన్ల కొనుగోలుకు సీసీఎస్ ఆమోదం

image

రెండు అణు జలాంతర్గాముల నిర్మాణంతో పాటు 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు PM మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS) ఆమోదం తెలిపింది. సబ్‌మెరైన్లను రూ.40వేల కోట్లతో వైజాగ్‌లో నిర్మించనున్నారు. USకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి డ్రోన్లను కొనుగోలు చేస్తారు. ఇవి వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా భారత్‌ చేతికి అందుతాయి. అందులో నేవీకి 15, ఆర్మీ, వాయుసేనకు చెరో 8 డ్రోన్లు కేటాయించారు.

News October 10, 2024

అక్టోబర్ 10: చరిత్రలో ఈ రోజు

image

1906: రచయిత R.K.నారాయణ్ జననం
1967: హాస్య నటుడు ఆలీ జననం
1973: దర్శకుడు రాజమౌళి జననం
1990: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జననం
2022: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం
✶ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

News October 10, 2024

ఆయనో గొప్ప మానవతా మూర్తి: ప్రధాని

image

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా విజనరీ వ్యాపారవేత్త అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. టాటా మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆయన దేశంలోనే పురాతనమైన, ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార సంస్థకు స్థిరమైన నాయకత్వం అందించారన్నారు. ఆయన గొప్ప మానవతా మూర్తి అని, విద్య, వైద్య, పారిశుద్ధ్యం, జంతు సంరక్షణ కోసం కృషి చేశారని చెప్పారు. దేశం ఒక ఐకాన్‌ను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు.