News October 10, 2024

దువ్వాడతో నాది పవిత్ర బంధం: మాధురి

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో తనది పవిత్ర బంధం అని దివ్వెల మాధురి చెప్పారు. ప్రజలు తమ మధ్య సంబంధాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రజా జీవితం వేరు.. రాజకీయాలు వేరు. రెండింటికీ ముడి పెట్టొద్దు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ది తప్పు కాకపోతే మాదీ తప్పు కాదు. ఇక్కడ ఎవరూ రాముడిలాగా ఏకపత్నీవ్రతులు లేరు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Similar News

News January 24, 2026

Photo Gallery: విద్యార్థులతో సీఎం చంద్రబాబు

image

AP: ఇవాళ నగరి పర్యటనలో CM CBN కాసేపు విద్యార్థులతో గడిపారు. బాలురు, బాలికల పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లను సందర్శించారు. నెట్ జీరో కాన్సెప్ట్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు, నెట్ జీరో ఎలక్ట్రిసిటీలో భాగంగా స్కూలుపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్, కంపోస్ట్ పిట్‌ను పరిశీలించి మాట్లాడారు. హాస్టల్ రూమ్స్, కిచెన్ రూమ్స్ తనిఖీ చేశారు.

News January 24, 2026

‘రథ సప్తమి’ ఎందుకు జరుపుకొంటారు?

image

సూర్యుడి గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే క్రమంలో మాఘ శుద్ధ సప్తమి నాడు ఆయన రథం ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అందుకే ఈ రోజును రథసప్తమి అంటారు. అలాగే సూర్యుడు 7 గుర్రాల రథంపై జగత్తుకు దర్శనమిచ్చింది కూడా ఈరోజే. నేటి నుంచి సూర్య కిరణాలు భూమికి దగ్గరగా వచ్చి ప్రాణికోటికి చైతన్యం, జఠరాగ్ని పెరుగుతాయని నమ్ముతారు. పాపాలను హరింపజేసే తిథి సూర్యారాధనకు అతి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

News January 24, 2026

ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ₹3,500తో గోవా టూర్

image

TGSRTC ప్రత్యేక లోబడ్జెట్‌ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. FEB 2వ వారంలో వరుస సెలవులతో గోవా టూర్‌ను ప్రకటించింది. లగ్జరీ బస్సులో ఒక్కరు ₹3,500కే 3 నైట్స్, 4 డేస్ ప్రయాణంతో గోవా టూర్ చేయొచ్చు. గోవాతో పాటు హంపీ, తుల్జాపూర్‌ల సందర్శనా ఉంటుంది. అలాగే ₹3వేలతోనే పండరీ పూర్, గానుగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. వివరాల కోసం 9391072283/9063401072 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.