News October 10, 2024

14న చిత్తూరు RR గార్డెన్‌లో లాటరీ సిస్టం

image

నూతన మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఈనెల 14న నిర్వహిస్తామని అర్బన్ ఎక్సైజ్ సీఐ శ్రీహరి రెడ్డి వెల్లడించారు. ఈనెల 11న షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో జరగాల్సిన టెండర్ ప్రక్రియను మార్పు చేసినట్లు చెప్పారు. టెండర్‌దారులు 14వ తేదీ సంతపేట RR గార్డెన్లో ఉదయం 8 గంటలకు జరిగే లాటరీ ప్రక్రియకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 3, 2025

నాన్న సారీ అంటూ యువకుడి ఆత్మహత్య

image

పెనుమూరు(M) విడిదిపల్లికి చెందిన డి.అరవింద్ (17) ప్రేమ విఫలమై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అక్టోబర్ 24 నుంచి అతను కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి విద్యార్థినితో అరవింద్ విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. నచ్చిన అమ్మాయి దూరమైందని డిప్రెషన్‌కు గురైన అరవింద్ నాన్న సారీ అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

News November 2, 2025

చిత్తూరు: వారికి రేపు పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో తొలిరోజే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 95.20 శాతం పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2,67,786 మంది లబ్ధిదారులు ఉండగా 2,54,943 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛను సొమ్ము అందజేశారు. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో మిగిలిన 12,843 మందికి సోమవారం పింఛన్ ఇవ్వనున్నారు.

News November 2, 2025

చిత్తూరు: ఖాళీ పోస్టులకు దరఖాస్తులు

image

చిత్తూరు సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీసీ వెంకటరమణ కోరారు. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనుల పర్యవేక్షణ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సైట్ ఇంజినీర్ పోస్టులు 3, డ్రాఫ్ట్ మెన్ పోస్టులు రెండింటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తామని.. ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.