News October 10, 2024

రతన్ టాటా విజయాలివే..

image

అనుభవలేమితో కెరీర్ ప్రారంభంలో రతన్ టాటా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. వాటినే సోపానాలుగా మలుచుకొని ఛైర్మన్ అయ్యాక తనదైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్‌ను విస్తరించారు. లండన్ టెట్లీ టీ కొనుగోలు, కార్ల తయారీ సంస్థలు జాగ్వార్, ల్యాండ్ రోవర్‌తో పాటు కోరస్ స్టీల్‌ను టాటాలో భాగం చేశారు. దీంతో పాటు ఐటీ, టెలి కమ్యూనికేషన్స్, ఆటో మొబైల్స్ రంగాల్లోనూ సంస్థను విస్తృతం చేసి సక్సెస్ అయ్యారు.

Similar News

News January 7, 2026

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఒడిశా కోరాపుట్ డివిజన్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (<>HAL<<>>) 3 Sr. మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MBBS+పీజీ/DNB/పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవంగల వారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in

News January 7, 2026

₹46,750 కోట్ల వెనిజులా బంగారం స్విట్జర్లాండ్‌కు!

image

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో హయాంలో ఏకంగా $5.2 బిలియన్ల (దాదాపు ₹46,750 కోట్లు) విలువైన బంగారం స్విట్జర్లాండ్‌కు తరలిపోయింది. 2013 నుంచి 2016 మధ్య సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని రిఫైనింగ్ పేరుతో అక్కడికి పంపారు. దేశ ఆర్థిక సంక్షోభం సాకుతో ఈ అమ్మకాలు జరిగాయి. మదురో అరెస్ట్ కావడంతో స్విస్ బ్యాంకులు ఆయన ఆస్తులను స్తంభింపజేశాయి. అయితే ఈ గోల్డ్‌ తరలింపు వెనక గుట్టు ఏంటనే దానిపై క్లారిటీ లేదు.

News January 7, 2026

వైభవ్ మరో సెంచరీ

image

యూత్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగిస్తున్నారు. U19 సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో 63 బంతుల్లో సెంచరీ చేశారు. ఇందులో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో ఆరోన్(85) కూడా శతకానికి చేరువలో ఉన్నారు.
* మ్యాచ్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.