News October 10, 2024

రెండు మద్యం షాపులకు తీవ్ర పోటీ.. ఎక్కడంటే?

image

AP: మద్యం దుకాణాల లైసెన్సుల కోసం బుధవారం రాత్రి వరకు 57,709 దరఖాస్తులొచ్చాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ప్రభుత్వానికి రూ.1154.18 కోట్ల ఆదాయం సమకూరింది. నేడు, రేపు కూడా అవకాశం ఉండటంతో మరో 40 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా. NTR(D) వత్సవాయి(M)లో 2 దుకాణాలకు అత్యధికంగా 217(రూ.4.2 కోట్లు) దరఖాస్తులొచ్చాయి. అత్యధికంగా NTR(D)లో 4,420, ఏలూరు(D)లో 3,843, విజయనగరం(D)లో 3,701 దరఖాస్తులు అందాయి.

Similar News

News October 10, 2024

రతన్ టాటాకు ఏపీ క్యాబినెట్ సంతాపం

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం మౌనం పాటించి రతన్ టాటాకు నివాళి అర్పించింది. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం కొనియాడారు. అనంతరం క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు, లోకేశ్ ముంబై వెళ్లి రతన్ టాటా భౌతికకాయానికి నివాళి అర్పించనున్నారు.

News October 10, 2024

ఇవి కూడా గర్భనిరోధక మార్గాలే

image

గర్భనిరోధక మార్గాల్లో ఎక్కువమందికి తెలిసింది కండోమ్‌లే. అయితే మరిన్ని సులువైన మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్యాండ్ ఎయిడ్ తరహాలో అత్యంత సులువుగా చేతికి అంటించుకునేవి కూడా వీటిలో ఉన్నాయి. ఇది హార్మోన్లను నియంత్రించడం ద్వారా గర్భం దాల్చకుండా చేస్తుంది. ఇక సెర్వికల్ క్యాప్, వెజైనల్ రింగ్, IUD, పిల్స్ వంటివి కూడా గర్భనిరోధకాలుగా పనికొస్తాయని వివరిస్తున్నారు.

News October 10, 2024

టాటా ఎప్పటికీ నా గుండెల్లోనే: ముకేశ్ అంబానీ

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో బిలియనీర్ ముకేశ్ అంబానీ ఎమోషనల్ అయ్యారు. ‘టాటా మరణం ఆయన కుటుంబానికే కాదు, దేశానికే తీరని లోటు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిని భారత్‌కు తీసుకువచ్చారు. టాటాలోని గొప్పతనం, మానవతా విలువలు ఆయనపై మరింత గౌరవం పెంచాయి. నేను ఓ మంచి స్నేహితుడిని కోల్పోయా. టాటా ఎప్పటికీ నా హృదయంలోనే ఉంటారు. రిలయన్స్ తరఫున ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ముకేశ్ పేర్కొన్నారు.