News October 10, 2024

ఈరోజు సెలవా? కాదా?

image

తెలంగాణలో ఇవాళ సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే నేడు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. అయితే సాధారణ సెలవు ఇవ్వాలని CMO ముఖ్య కార్యదర్శికి తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతిపత్రం ఇచ్చింది. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇవాళ ఉద్యోగులకు ఆప్షనల్ సెలవు మాత్రమే ఉండనుంది.

Similar News

News February 7, 2026

దీపారాధన: ఎన్ని వత్తులకు ఏ ఫలితం?

image

దీపారాధనలో వత్తుల సంఖ్యను బట్టి ఫలితాలుంటాయి. 2 వత్తులు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తే, 3 ఉత్తమ సంతానాన్ని, 5 పంచభూతాల అనుగ్రహాన్ని కలిగిస్తాయి. 7 వత్తులు 7 జన్మల పాపాలను పోగొడతాయి. 8 వత్తులు అష్టైశ్వర్యాలను, 9 కీర్తి ప్రతిష్ఠలను ఇస్తాయి. 10 వత్తులు సర్వాంతర్యామికి సంకేతం. 27 వత్తులు నక్షత్ర ఫలితాలను, 108 సర్వ అరిష్టాల నివారణను, 360 వత్తులు ఏడాది పొడవునా దీపారాధన చేసిన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి.

News February 7, 2026

Rose day: గులాబీ ‘రంగులు’ తెలుసా?

image

ప్రేమికులకు ఇష్టమైన వాలంటైన్స్ వీక్ నేటి నుంచి మొదలైంది. తొలి రోజును Rose dayగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫీలింగ్స్‌ను వ్యక్తపరిచేందుకు రంగురంగుల రోజాలను తమకు ఇష్టమైనవారికి ఇస్తారు.
* ఎర్ర గులాబీ-ప్రేమకు చిహ్నం * తెలుపు-అమాయకత్వం, స్వచ్ఛత * పసుపు-ఆనందం, స్నేహం, పింక్- ప్రశంస, కృతజ్ఞత * బ్లూ కలర్-విడిచిపెట్టకుండా ఉండలేకపోవడం, * గ్రీన్ రోజ్- సంపద, ప్రశాంతత * నల్ల గులాబీ- తిరస్కరణ, విచారం.

News February 7, 2026

ధనప్రాప్తి కలగాలంటే ఏం చేయాలంటే?

image

ధనప్రాప్తి కలగడానికి కొన్ని ఆచారాలు పాటించాలి. రోజూ పూజ చేసే సమయంలో ‘శ్రీ సూక్తం’ పఠించాలి. అమ్మవారిని ఉపాసిస్తూ ఓ లవంగాన్ని ఆమె వద్ద ఉంచడం శుభప్రదం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ప్రతి శనివారం విరిగిన వస్తువులను పారేసి, బూజు దులపాలి. పూజ గదిలో ‘ఏకాక్షి కొబ్బరికాయ’ ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే రెండు అరచేతులను చూసుకుని కళ్లకు అద్దుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.