News October 10, 2024
ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంది. ఇటు MBBS మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు ఈ నెల 14తేదీ లోపు ఫ్రీఎగ్జిట్ అవ్వొచ్చని తెలిపింది. దివ్యాంగ కోటాలో కన్వీనర్ సీట్లు పొందిన వారు ఈ నెల 11లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలంది.
Similar News
News March 11, 2026
జాగ్రత్త.. 3 రోజులు భగభగలు

నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట ప్రయాణాలు మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
News March 11, 2026
ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి రూ.6,000

AP: పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలు డిపాజిట్ కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం రూ.6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది.
News March 11, 2026
ఓవైపు ఎండ.. మరోవైపు వర్షం!

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అక్కడక్కడా జల్లులు కురిశాయి. పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నంద్యాలలో 36.2 డిగ్రీలు నమోదైంది.


