News October 10, 2024

శాంతి, స్థిరత్వంపై ASEAN దేశాలతో చర్చిస్తా: మోదీ

image

ASEAN దేశాలతో భారత్ బంధం మరింత బలపడుతుందని PM మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కోఆపరేషన్ ఫ్యూచర్ దిశ, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అక్కడి లీడర్లతో చర్చిస్తానని చెప్పారు. ASEAN-India, ఈస్ట్ ఏషియా సదస్సుల కోసం ఉదయం ఆయన లావోస్ బయల్దేరారు. ‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు ఈస్ట్ ఏషియా సదస్సు మంచి అవకాశం. లావో PDR నేతలను కలుస్తాను’ అని మోదీ తెలిపారు.

Similar News

News October 10, 2024

హరియాణా ఫలితాలపై ECకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని తెలిపింది. మరో 13 సెగ్మెంట్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నట్లు తెలిపింది.

News October 10, 2024

కాసేపట్లో వర్షం

image

TGలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. యాదాద్రి, వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట, సిరిసిల్ల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, MBNR, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, వనపర్తి, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

News October 10, 2024

రతన్ టాటా వారసుడు ఎవరు?

image

రతన్ టాటా మరణంతో ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. రతన్‌కు పిల్లలు లేకపోవడంతో ట్రస్ట్‌లో వాటా ఎవరికి దక్కుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన సవతితల్లి కుమారుడు నోయెల్ టాటా పిల్లలు మాయ, నెవిల్లే, లేహ్‌ అందుకు అర్హులనే చర్చ నడుస్తోంది. వీరంతా ప్రస్తుతం టాటా సంస్థలోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరే టాటా సామ్రాజ్యానికి కాబోయే అధిపతులని విశ్లేషకులు భావిస్తున్నారు.