News October 10, 2024
చౌటుప్పల్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉద్యోగాలు

చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన అఫ్జల్ ఖాన్, ఖాజాబీ కుటుంబ సభ్యులు డీఎస్సీ ఫలితాలలో ఉద్యోగాలు సాధించారు. వారి కుమారులు జావిద్ ఖాన్ SGT, ఖాదీర్ ఖాన్ PGT ఇంగ్లిష్, కోడలు అసినా బేగం TGT Maths , గురుకులంలో ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. దీంతో గ్రామస్థులు అభినందనలు తెలిపారు. తండ్రి పాన్ షాప్ నడుపుతూ తమను బాగా చదివించినట్లు వారు తెలిపారు.
Similar News
News September 16, 2025
రేపు నల్గొండలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

నల్గొండలో పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
News September 16, 2025
NLG: అమ్మకానికి ‘దొడ్డు’ బియ్యం

నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఈ వేలం ద్వారా అమ్మకం చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,927 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యాన్ని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కిలోకు రూ.24 చొప్పున ఈ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
News September 15, 2025
ఏడాదిలో 19 మందిపై పోక్సో కేసులో శిక్ష: నల్గొండ ఎస్పీ

గడిచిన సంవత్సరంలో నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం కింద 18 కేసులలో 19 మంది నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కేసులలో సకాలంలో సాక్ష్యాధారాలు సేకరించి, ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.