News October 10, 2024
హీరోయిన్‌తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్‌లో ఆయన ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్‌గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ వివాహమాడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News February 10, 2026
శ్రీలంక జట్టుకు కీలక ప్లేయర్ దూరం

T20 WC జరుగుతున్న వేళ శ్రీలంక జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. అతని ఎడమ కాలి కండరాల్లో చీలిక ఏర్పడినట్లు MRI స్కానింగ్‌లో తేలడంతో జట్టు నుంచి తప్పించారు. హసరంగ స్థానంలో లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ దుషాన్ హేమంతకు జట్టులో చోటు కల్పించారు. 8వ తేదీ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే.
News February 10, 2026
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

AP: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.1,200 కోట్ల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
News February 10, 2026
ఎల్లుండి నుంచి MLAలకు డిజిటల్ అటెండెన్స్!

AP: అసెంబ్లీకి కొందరు సభ్యులు గైర్హాజరు అవుతుండటంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు సభ్యుల ఫింగర్ ప్రింట్స్ నమోదు చేసి.. ఎల్లుండి నుంచి డిజిటల్ విధానంలో హాజరు తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే MLA తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. అటు రేపు జగన్‌తో పాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్తారని ఆ పార్టీ నేత బొత్స తెలిపారు.


