News October 10, 2024

రజినీ ‘వేట్టయన్’ రివ్యూ

image

ఇది ప్రాపర్ క్రైమ్ థ్రిల్లర్ కథ. మంచి స్టోరీ లైన్ ఎంచుకున్న దర్శకుడు జ్ఞానవేల్ స్క్రీన్‌ప్లేపై దృష్టి పెట్టాల్సింది. ఫస్టాఫ్ ఫర్వాలేదు అన్పించినా, సినిమా అంతా ఒకే కంటెంట్ లైన్‌లో రన్ అవడంతో రెగ్యులర్ ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలవుతారు. డైలాగులు బాగున్నా, పరిమితికి మించి మెసేజులు ఇస్తున్నట్లు అనిపిస్తుంది. రజినీ సహా అమితాబ్, రానా, ఫాజిల్ నటనతో మెప్పించారు. అనిరుధ్ మ్యూజిక్ ఫర్వాలేదు.
రేటింగ్: 2.5/5

Similar News

News July 9, 2025

రేపు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు, లోకేశ్

image

AP: సీఎం చంద్రబాబు రేపు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తచెరువులోని శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0లో పాల్గొననున్నారు. CMతో పాటు మంత్రి లోకేశ్ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ జరగనుంది.

News July 9, 2025

దర్శకుడితో సమంత మరో టూర్.. ఫొటోలు వైరల్

image

స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మరోసారి విదేశాల్లో పర్యటించారు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దీంతో మరింత ఊపందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు సమంత గానీ, రాజ్‌గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గతంలో వీరిద్దరు <<16638854>>దుబాయ్‌లో<<>> పర్యటించారు.

News July 9, 2025

ఏపీ సీఎంకు తెలంగాణ MLA విజ్ఞప్తి

image

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును అచ్చంపేట MLA వంశీకృష్ణ కోరారు. నిన్న శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేందుకు వచ్చిన CMను డ్యాంపైన కలిసి మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణ ఆవశ్యకతపై MLA వినతిపత్రం ఇచ్చారు. మద్దిమడుగు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి AP నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తారని, వంతెన నిర్మాణం పూర్తైతే 100KM దూరం తగ్గుతుందని వివరించారు.