News October 10, 2024

ఇవి కూడా గర్భనిరోధక మార్గాలే

image

గర్భనిరోధక మార్గాల్లో ఎక్కువమందికి తెలిసింది కండోమ్‌లే. అయితే మరిన్ని సులువైన మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్యాండ్ ఎయిడ్ తరహాలో అత్యంత సులువుగా చేతికి అంటించుకునేవి కూడా వీటిలో ఉన్నాయి. ఇది హార్మోన్లను నియంత్రించడం ద్వారా గర్భం దాల్చకుండా చేస్తుంది. ఇక సెర్వికల్ క్యాప్, వెజైనల్ రింగ్, IUD, పిల్స్ వంటివి కూడా గర్భనిరోధకాలుగా పనికొస్తాయని వివరిస్తున్నారు.

Similar News

News July 9, 2025

రేపు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు, లోకేశ్

image

AP: సీఎం చంద్రబాబు రేపు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తచెరువులోని శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0లో పాల్గొననున్నారు. CMతో పాటు మంత్రి లోకేశ్ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ జరగనుంది.

News July 9, 2025

దర్శకుడితో సమంత మరో టూర్.. ఫొటోలు వైరల్

image

స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మరోసారి విదేశాల్లో పర్యటించారు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దీంతో మరింత ఊపందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు సమంత గానీ, రాజ్‌గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గతంలో వీరిద్దరు <<16638854>>దుబాయ్‌లో<<>> పర్యటించారు.

News July 9, 2025

ఏపీ సీఎంకు తెలంగాణ MLA విజ్ఞప్తి

image

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును అచ్చంపేట MLA వంశీకృష్ణ కోరారు. నిన్న శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేందుకు వచ్చిన CMను డ్యాంపైన కలిసి మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణ ఆవశ్యకతపై MLA వినతిపత్రం ఇచ్చారు. మద్దిమడుగు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి AP నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తారని, వంతెన నిర్మాణం పూర్తైతే 100KM దూరం తగ్గుతుందని వివరించారు.