News October 10, 2024
నాలుక కోసుకుని దుర్గామాతకు సమర్పించిన భక్తుడు!

దుర్గామాతపై భక్తిని చాటుకునేందుకు ఓ వ్యక్తి అవాంఛిత చర్యకు పూనుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా లాహర్ నగర్‌లో రతన్‌గఢ్ దేవీ ఉత్సవాల్లో రామ్ శరణ్ పాల్గొన్నాడు. అనంతరం తన నాలుకను తెగ్గోసుకుని అమ్మవారికి సమర్పించి, రక్తాన్ని అక్కడి పాత్రలో పోశాడు. ఇది చూసిన స్థానికులంతా నివ్వెరపోయారు. ఈ ఘటన తర్వాత రామ్ కాసేపు ఆలయంలోనే నిద్రించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
– ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.
Similar News
News December 28, 2025
సాగు కోసం వర్షపు నీటిని కాపాడుకుందాం

వ్యవసాయానికి వాన నీరే కీలకం. ఈ నీటిని పరిరక్షించి, భూగర్భ జలాలను పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం వర్షపు నీరు నేలలో ఇంకేలా వాలుకు అడ్డంగా కాలువలు, కందకాలు తీసి నీరు వృథాగా పోకుండా చూడాలి. నీటి గుంటలు, చెక్‌డ్యామ్స్, ఫామ్‌పాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భజలాలను పెంచవచ్చు. బీడు భూముల్లో చెట్ల పెంపకం, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి. దీని వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేలకోత తగ్గి భూసారం పెరుగుతుంది.
News December 28, 2025
CCMBలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

హైదరాబాద్‌లోని <
News December 28, 2025
కోచ్ మార్పుపై BCCI క్లారిటీ

టెస్ట్ జట్టు కోచ్‌గా గంభీర్‌ను పక్కనపెట్టి లక్ష్మణ్‌ను తీసుకొంటారని వస్తున్న వార్తలను BCCI ఖండించింది. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది సౌతాఫ్రికా(0-2), న్యూజిలాండ్(0-3)తో టెస్టు సిరీస్‌లు వైట్‌వాష్ కావడంతో గంభీర్ కోచింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాదాపు 12ఏళ్ల తర్వాత IND స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. దీంతో గంభీర్ ప్రయోగాలే ఓటమికి కారణమని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.


