News October 10, 2024

రతన్ టాటాకు ‘భారతరత్న’ ఇవ్వాలని MH ప్రభుత్వం తీర్మానం!

image

దివంగత రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇవాళ నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. దేశ పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా గొప్ప మానవతావాది అయిన రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 10, 2024

తూర్పుగోదావరిలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్

image

AP: నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ పట్టణాలకూ విస్తరిస్తోంది. తాజాగా తూ.గో(D) భూపాలపట్నంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు యువకులు టెలిగ్రామ్‌లో కొకైన్ కొనుగోలు చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టౌన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 4గ్రా. కొకైన్, 50గ్రా. గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.

News October 10, 2024

ఏపీకి వెళ్లాల్సిందే.. IASల విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం

image

తెలంగాణలోని ఏపీ కేడర్ IASలపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి సహా 11 మంది IAS ఆఫీసర్లు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.

News October 10, 2024

దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్

image

2024 ఏడాదికిగానూ సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌ను నోబెల్ వ‌రించింది. మాన‌వ జీవితంలోని చ‌రిత్రాత్మ‌క సంఘ‌ర్ష‌ణ‌లు, దుర్భ‌ల‌త్వాన్ని క‌ళ్ల‌కు క‌డుతూ ఆమె రాసిన ప్ర‌భావ‌వంత‌మైన‌ క‌విత‌ల‌కు గుర్తింపుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం దక్కింది. సియోల్‌లో స్థిరపడ్డ హాన్ సాహిత్యంతోపాటు, క‌ళ‌లు, సంగీతానికి జీవితాన్ని అంకితం చేశార‌ని ది స్వీడిష్ అకాడ‌మీ పేర్కొంది.