News October 10, 2024
మిల్లెట్స్‌తో రతన్ టాటా చిత్రపటం

దాతృత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ, భారతదేశానికి, పారిశ్రామిక రంగానికి పేరు ప్రఖ్యాతి తెచ్చిన మహోన్నత వ్యక్తికి విశాఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. మిలెట్స్ ఉపయోగించి రతన్ టాటా చిత్రాన్ని తయారు చేశారు. ఆ మహనీయునికి తాను ఇచ్చే నివాళి ఇది అని విజయ్ కుమార్ అన్నారు.
Similar News
News September 20, 2025
9 నెలల్లో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి: వీఎంఆర్డీఏ ఛైర్మన్

మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు. జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల కోసం కూడా వుడా పార్కులో స్టేట్ బోర్డు పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం అడివివరం- శొంఠ్యాం, శొంఠ్యాం-గుడిలోవ పనులను పరిశీలించారు.
News September 20, 2025
విశాఖలో ఈ గవర్నెన్స్ సదస్సుపై సమీక్ష

విశాఖలో ఈ నెల 22,23న జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుపై ఐటి విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ శనివారం సమీక్షించారు. రెండు రోజుల సదస్సుకు వెయ్యి మంది ప్రతినిధులు వస్తారన్నారు. కొందరు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. సదస్సు జరగనున్న హోటల్ వద్ద వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు.
News September 20, 2025
విశాఖలో నాలుగు కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు 4 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. విశాఖ-గోపాలపట్నం, దువ్వాడ-ఉత్తర సింహాచలం, వడ్లపూడి-గేట్ కేబిన్ జంక్షన్ మార్గాల్లో కొత్త లైన్లు రానున్నాయి. పెందుర్తి-ఉత్తర సింహాచలం మధ్య పైవంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల ఆలస్యం తగ్గి, రన్నింగ్ టైమ్ కుదించడంతో పాటు వేగం పెరుగుతుందని అధికారులు తెలిపారు.