News October 10, 2024

కొండా సురేఖకు కోర్టు నోటీసులు

image

TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కొండా సురేఖ అసత్య ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

Similar News

News August 31, 2025

VIRAL: ఒకటో తరగతికి రూ.8,35,000 ఫీజు

image

బెంగళూరులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పిల్లల ఫీజులు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏడాదికి 1-5 తరగతులకు రూ.7.35 లక్షలు, 6-8కి రూ.7.75 లక్షలు, 9-10 క్లాసులకు రూ.8.50 లక్షల ఫీజు అని ఆ స్కూల్ పేర్కొంది. రెండు టర్మ్‌ల్లో చెల్లించాలని తెలిపింది. అంతేకాదు అడ్మిషన్ ఫీజు రూ.లక్ష అని వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని, జాయిన్ అవ్వకపోతే తిరిగి రీఫండ్ చేయడం కుదరదని స్పష్టం చేసింది.

News August 31, 2025

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్

image

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో తాను వివాహం చేసుకోనున్నట్లు టాలీవుడ్ హీరో నారా రోహిత్ తెలిపారు. ‘ప్రతినిధి 2’ హీరోయిన్ శిరీషను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. రోహిత్ నటించిన ‘సుందరకాండ’ మూవీ ఇటీవలే విడుదలైంది.

News August 31, 2025

నీరు లేని చోటు నుంచి ఉన్న చోటుకు మార్చాం: హరీశ్ రావు

image

TG: తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదని, క్యాబినెట్‌లో చర్చించామని హరీశ్ రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘నీరు లేని చోటు నుంచి ఉన్న చోటుకు మార్చాం. 2009-14 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా.. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. ఆంధ్రా పాలనలో అన్యాయం జరిగింది కాబట్టే కాళేశ్వరం నిర్మించాం’ అని తెలిపారు.