News October 10, 2024

పాక్‌తో టెస్టు.. చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. 150 ఓవర్లలోనే 823/7(D) స్కోర్ చేసి పలు రికార్డులు సొంతం చేసుకుంది. 800పైన స్కోర్ 3 సార్లు చేసిన తొలి జట్టు, 5.48 రన్‌రేట్‌తో 700పైన రన్స్ చేసిన మొదటి టీమ్‌గా ENG నిలిచింది. అలాగే టెస్టు క్రికెట్‌లో ఇది నాలుగో అత్యధిక స్కోర్. తొలి స్థానంలో శ్రీలంక 952/5d(vsIND) ఉండగా, ఆ తర్వాత ఇంగ్లండ్ 903/7d(vs AUS), 848(vsWI) ఉంది.

Similar News

News October 10, 2024

వారిద్దరూ ఛాన్సులు వేస్ట్ చేసుకుంటున్నారు: ఆకాశ్ చోప్రా

image

బంగ్లాతో టీ20 సిరీస్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శాంసన్ అవకాశాల్ని వృథా చేసుకుంటున్నారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. భారత జట్టులో ఓపెనర్లకు చాలా పోటీ ఉందని గుర్తు చేశారు. ‘వారికి విలువైన 2 ఛాన్సులు అయిపోయాయి. తమ వికెట్‌ను పారేసుకోకుండా భారీ స్కోరు చేసేందుకు చూడాలి. సౌతాఫ్రికా టూర్‌కి జైస్వాల్, గిల్, రుతురాజ్ రెడీగా ఉంటారు. ఇషాన్ కిషాన్ కూడా రేసులోకి రావొచ్చు’ అని అంచనా వేశారు.

News October 10, 2024

రాష్ట్రంలో 604 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

image

AP: KGBVల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీచర్ జాబ్‌లు 507, నాన్-టీచింగ్ ఉద్యోగాలు 97 ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, PG, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై, 18-42 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది.
వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in/

News October 10, 2024

25 నుంచి మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన

image

AP: మంత్రి నారా లోకేశ్ ఈ నెల 25 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. శాన్​ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు.