News October 10, 2024

పార్సీ సంప్ర‌దాయం ప్ర‌కారం ర‌త‌న్ టాటా అంత్య‌క్రియ‌లు!

image

ర‌త‌న్ టాటా అంత్య‌క్రియ‌లు పార్సీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగే అవకాశం ఉంది. జొరాస్ట్రియ‌న్లు దేహాన్ని ప్ర‌కృతివ‌రంగా భావిస్తారు. గాలి, నీరు, నిప్పు కలుషితం కాకుండా తిరిగి ప్ర‌కృతికే స‌మ‌ర్పిస్తారు. గద్దలు, రాబందుల‌కు ఆహారంగా ఉంచుతారు. అయితే ప్రస్తుతం పార్సీలు ఎక్కువగా పర్యావరణహితం కోసం ఎల‌క్ట్రిక్ క్రిమెటోరియంలను ఆశ్రయిస్తున్నారు. ర‌త‌న్ టాటా అంత్య‌క్రియ‌లూ అలాగే జరిగే అవకాశం ఉంది.

Similar News

News July 9, 2025

యూట్యూబ్ కొత్త రూల్స్.. ఎప్పటినుంచంటే?

image

యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానాన్ని ఈనెల 15వ తేదీ నుంచి కఠినతరం చేయనుంది. ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, రీయూజ్డ్ కంటెంట్‌ను తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. AI వీడియోలు, కాపీపేస్ట్ కంటెంట్, తక్కువ ఒరిజినాలిటీ ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తే ఛానళ్లు డీమానిటైజ్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కంటెంట్‌తో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పాటించాలని పేర్కొంది.

News July 9, 2025

టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్-10లోకి భారత కెప్టెన్

image

మెన్స్ క్రికెట్ టెస్ట్ ర్యాంకులను ICC ప్రకటించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నం.1 స్థానంలో నిలవగా మరో బ్యాటర్ రూట్ ఓ స్థానం దిగజారి నం.2లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్ జైస్వాల్ నాలుగో స్థానంలో, కెప్టెన్ గిల్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచారు. వికెట్ కీపర్ పంత్ ఒక స్థానం దిగజారి 8వ స్థానంలో ఉన్నారు. అటు టెస్టుల్లో ఆస్ట్రేలియా, వన్డే, టీ20ల్లో టీమ్ ఇండియా తొలి స్థానంలో ఉన్నాయి.

News July 9, 2025

‘శబరి’ రైలు ఇక సూపర్‌‌ఫాస్ట్

image

సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ రైలు మ.2.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతి రోజు సా.6.20కు తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉ.6.45కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.11 గంటలకే సికింద్రాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై త్వరలోనే అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.