News October 10, 2024

ఏపీకి వెళ్లాల్సిందే.. IASల విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం

image

తెలంగాణలోని ఏపీ కేడర్ IASలపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి సహా 11 మంది IAS ఆఫీసర్లు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News October 10, 2024

వారంలో రూ.7,500 కోట్ల డ్రగ్స్ సీజ్

image

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కార్యకలాపాలపై స్పెషల్ సెల్ ఉక్కుపాదం మోపుతోంది. వారం వ్యవధిలోనే రూ.7,500 కోట్ల విలువైన 762 కేజీల కొకైన్‌ను సీజ్ చేసింది. ఇటీవల 560 కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఇవాళ 200 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్ చేసింది.

News October 10, 2024

ఏపీ మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపు రాత్రి 7 గంటలతో ముగియనుంది. షాపులకు అమెరికా, యూరప్ దేశాల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య వెల్లడించారు. అమెరికా నుంచి అత్యధికంగా 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. కాగా నిన్నటి వరకు 57 వేల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,154 కోట్ల ఆదాయం వచ్చింది.

News October 10, 2024

OTTలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ

image

బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘స్త్రీ-2’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రెగ్యులర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గత నెల 26 నుంచి రెంటల్(రూ.349) పద్ధతిలో అందుబాటులో ఉండగా, ఇవాళ్టి నుంచి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఫ్రీగా వీక్షించవచ్చు. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ.700 కోట్లను వసూలు చేసిన విషయం తెలిసిందే.