News October 10, 2024
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా గాదె మధుసూదన్

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాపట్లకు చెందిన మాజీ మంత్రి తనయుడు గాదె మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన మధుసూదన్ రెడ్డి బాపట్ల జిల్లాలో వైసీపీకి కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నూతన కమిటీలలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News July 7, 2025
ANMల బదిలీలలో చిక్కుముడులు.. మరోసారి కౌన్సెలింగ్

గుంటూరు జిల్లా వైద్య శాఖ ఇటీవల ANM గ్రేడ్-3గా ఉన్న సుమారు 200 మందికి పదోన్నతులు మంజూరు చేసి కొత్త నియామకాలు ఇచ్చింది. కానీ గత కౌన్సెలింగ్‌లో అదే పోస్టులు ఖాళీలుగా చూపటంతో పలువురు ఎంపిక చేసుకున్నారు. ఈ అంశం అధికారులు గుర్తించడంతో గత కౌన్సెలింగ్‌ను రద్దు చేసి సోమవారం మళ్లీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మీ తెలిపారు. ఈసారి ప్రక్రియ సునిశ్చితంగా, సీనియారిటీ ప్రాతిపదికన సాగనుంది.
News July 7, 2025
వికేంద్రీకరణ పద్ధతిలో PGRS అమలు: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా అమలు కానుందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు సమీప మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ఇలా నిర్వహించడం వల్ల పాలన ప్రజలకు చేరువ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఫిర్యాది దారులు ఉపయోగించుకోవాలన్నారు.
News July 6, 2025
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడండి: ఎస్పీ

గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్వోబీ పనులు జరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపులను ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండే రహదారులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపులు వద్ద తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించి సమన్వయం చేసుకోవాలన్నారు. సమాచార వ్యవస్థతో ప్రణాళిక బద్దంగా ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.