News October 10, 2024

నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్

image

తన కుమారుడు జునైద్‌ను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బస్సులో తిరగమని చెప్పానని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. త్వరలో టెలికాస్ట్ కానున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్‌లో ఆయన ఈ విషయం చెప్పారు. ‘భారత్ అనేక సంస్కృతులకు నిలయం. దేశవ్యాప్తంగా ప్రయాణించి అవన్నీ తెలుసుకోవాలని, ప్రజలతో మమేకమవ్వాలని చెప్పాను. ఏ స్కూల్, కాలేజీ చెప్పని అంశాలు ఈ ప్రయాణంలో తెలుస్తాయి’ అని పేర్కొన్నారు.

Similar News

News October 11, 2024

నేటి నుంచి రంజీ ట్రోఫీ

image

దేశంలో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ ఇవాళ ప్రారంభం కానుంది. 2024-25 సీజన్ దాదాపు 5 నెలలు కొనసాగనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 8 నుంచి, సెమీ ఫైనల్స్ 17 నుంచి, 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముంబై బరిలో దిగనుంది. ఓవరాల్‌గా ఆ జట్టు ఏకంగా 42 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది.

News October 11, 2024

రతన్ టాటాపై పేటీఎం సీఈవో ట్వీట్.. నెటిజన్ల విమర్శలు

image

పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ వర్మ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాపై చేసిన ట్వీట్ విమర్శలకు దారి తీసింది. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్‌ను కోల్పోయామని పేర్కొంటూ చివర్లో టాటా బై బై అంటూ విజయ్ శేఖర్ రాసుకొచ్చారు. దీంతో దిగ్గజానికి వీడ్కోలు పలికే పద్దతి ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇది సరికాదంటూ హితవు పలికారు. అయితే కాసేపటికే ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.

News October 11, 2024

రతన్ టాటా బయోపిక్.. ఓ అవసరం!

image

ప్రజల కోసం పరితపించిన సమాజ సేవకుడిగా, నిత్య కృషీవలుడిగా రతన్ టాటా కీర్తి భూమిపై అజరామరం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మహనీయుడి జీవితం ముందు తరాలకూ గుర్తుండేలా ఆయనపై ఓ బయోపిక్ తీయాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. లక్షల జీవితాల్లో వెలుగులు నింపిన ‘రత్నం’లాంటి ఆ మనిషి కృషి ఎన్ని తరాలైనా మరచిపోని రీతిలో తెరకెక్కాలంటూ అభిమానులు కోరుతున్నారు. ఈ బాధ్యతను టాలీవుడ్ తీసుకుంటుందేమో చూడాలి.