News October 10, 2024
బీజేపీ నేతల్ని హెచ్చరించిన మావోయిస్టులు
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేతల్ని మావోయిస్టులు హెచ్చరించారు. పార్టీ విస్తరణ చర్యలు నిలిపివేయాలని బీజేపీ నేతలు వెంకటేశ్వర్, బిలాల్ ఖాన్‌లను బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల మాడెడ్ ఏరియా కమిటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. దీంతో బీజాపూర్, సుక్మా జిల్లాల్లో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్ నిలిచిపోయింది.
Similar News
News December 22, 2024
ఆ వస్తువులపై 1% ఫ్లడ్ సెస్ విధించాలి: మంత్రి పయ్యావుల
AP: GST విధానంలో మార్పులు, చేర్పులపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు. ‘5శాతానికి మించి శ్లాబులో ఉన్న వస్తువులపై 1% ఫ్లడ్ సెస్ విధించాలి. ఈ సెస్‌తో వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడతాం. రేషన్ ద్వారా వచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై GST సుంకం తగ్గించాలి. IGST వ్యవస్థను పారదర్శకంగా చేపట్టాలి. రాష్ట్రాలకూ డేటా అందుబాటులో ఉండేలా చూడాలి’ అని జైసల్మేర్‌లో జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో మంత్రి అన్నారు.
News December 21, 2024
నిద్రలో ఎందుకు కలవరిస్తారంటే?
కొందరు నిద్రలోనే మాట్లాడుతుంటారు. కొంతమంది గొణగడం చేస్తే, మరికొందరు స్పష్టంగా గట్టిగా కలవరిస్తుంటారు. 3 నుంచి పదేళ్ల మధ్య ఉన్న పిల్లలు, కొందరు పెద్దలు నిద్రలో మాట్లాడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం తాము చేసిన పని గురించి, కలలతో సంబంధం ఉన్నా, కొన్ని రకాల మందులు వాడినా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలా ప్రవర్తిస్తారు. కొందరికి జన్యుపరంగా కూడా ఈ అలవాటు వస్తుంది.
News December 21, 2024
ఇన్సూరెన్సులు కట్టేవారికి నో రిలీఫ్
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులు ప్రీమియంలపై జీఎస్టీ భారం తగ్గనుందనే ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దీనిపై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా ఇన్సూరెన్సుల ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని తగ్గించనున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా నిర్మల ప్రకటనతో క్లయింట్లకు నిరాశే ఎదురైంది.