News October 11, 2024

NLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా సద్దుల బతుకమ్మ సందడి

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజులు పాటు మహిళలు తీరక్క పూలతో బతుకమ్మలు తయారుచేసి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఆటపాటలతో బతుకమ్మలు ఆడారు. చివరి రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా ఊరూరా బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను చెరువులు,కుంటలలో నిమజ్జనం చేశారు.

Similar News

News November 1, 2025

చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారు!

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈనెల రెండో తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది.

News November 1, 2025

జిఎన్ఎం కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరీ (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా వైద్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డిఎంహెచ్వో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.

News November 1, 2025

పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.