News October 11, 2024

సారీ.. పోటీలో వెనుకబడ్డాం: శామ్‌సంగ్

image

పోటీలో వెనుకబడినందుకు తమను క్షమించాలని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వినియోగదారుల్ని కోరింది. ఈ ఏడాది మూడో త్రైమాసిక ఆదాయ వివరాల సందర్భంగా ఆ లేఖను విడుదల చేసిందని ‘ది వెర్జ్’ మ్యాగజైన్ తెలిపింది. స్మార్ట్‌ఫోన్, సెమీకండక్టర్ విభాగాల్లో కొత్త ఆవిష్కరణలుండటం లేదన్న విమర్శల్ని శామ్‌సంగ్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే సంస్థ కొత్త ఉపాధ్యక్షుడు జియోన్ యంగ్-హ్యూన్ ఈ లేఖ రాశారని ‘ది వెర్జ్’ పేర్కొంది.

Similar News

News January 29, 2026

యాసంగి ఆముదం పంటలో పురుగుల కట్టడికి సూచనలు

image

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంటలో వివిధ పురుగుల తీవ్రత పెరిగింది. రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2ML లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటను లద్దె పురుగు ఆశిస్తే లీటరు నీటికి నొవాల్యురాన్ 1ML కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ML కలిపి పిచికారీ చేయాలి.

News January 29, 2026

పేపర్ ప్లేట్‌గా బ్యాంకు డాక్యుమెంట్.. ప్రైవసీ అంటే ఇదేనా?

image

కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్న బ్యాంకు డాక్యుమెంట్ రోడ్డు పక్కన పేపర్ ప్లేట్‌గా మారడం ఇప్పుడు వైరలవుతోంది. పేరు, లొకేషన్, పేమెంట్ డీటెయిల్స్ వంటి సెన్సిటివ్ డేటా బహిరంగంగా కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కస్టమర్ డేటాను బ్యాంకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తాయని ప్రశ్నిస్తున్నారు. Moronhumor పేరిట ఉన్న X అకౌంట్‌లో ఈ ఫొటో చూశాక డేటా ప్రైవసీపై SMలో పెద్ద చర్చే నడుస్తోంది.

News January 29, 2026

RBIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>RBI<<>>)కాన్పూర్‌లో 3 మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, పీజీ(జనరల్ మెడిసిన్)అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rbi.org.in