News October 11, 2024

TODAY HEADLINES

image

✒ రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి
✒ హరియాణా ఫలితాలపై ECకి కాంగ్రెస్ ఫిర్యాదు
✒ నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: CBN
✒ పవన్ కళ్యాణ్‌కు మళ్లీ అస్వస్థత
✒ CBN మాదిరి అబద్ధాలు చెప్పి ఉంటే CMగా ఉండేవాడినేమో: జగన్
✒ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి.. AP ప్రభుత్వం ఉత్తర్వులు
✒ TGవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
✒ APకి వెళ్లాల్సిందే.. TGలోని 11 మంది IASలకు కేంద్రం ఆదేశం
✒ కొండా సురేఖకు హైకోర్టు నోటీసులు

Similar News

News January 1, 2026

అందుకే దాస్‌పై ఆరోపణలు: CM రేవంత్

image

TG: పాలమూరు-RR ప్రాజెక్టు వివాదం వేళ వార్తల్లో నిలిచిన ఇరిగేషన్ సలహాదారు <<18689807>>ఆదిత్యనాథ్<<>> దాస్ గురించి CM రేవంత్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ఆయనకు అవగాహన ఉండటంతోనే AP నుంచి తీసుకొచ్చామన్నారు. ఆయనది అటు ఏపీ, ఇటు తెలంగాణ కాదని, దాస్ బిహార్‌కు చెందినవాడని తెలిపారు. కేసీఆర్, హరీశ్ రావు దొంగతనాన్ని బయటపెడతాడనే భయంతోనే ఆయనపై BRS నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

News January 1, 2026

మద్యం విక్రయాలకు న్యూ ఇయర్ కిక్కు

image

AP: మద్యం అమ్మకాలు డిసెంబర్(2025)లో గణనీయంగా పెరిగి ₹2,767 కోట్ల ఆదాయం సమకూరింది. 2024లో ఇదే నెలలో ₹2,568 కోట్లు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు, వరుస సెలవుల రాకతో 29, 30, 31 తేదీల్లో ఏకంగా ₹543 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024లో ఇది ₹336 కోట్లు మాత్రమే. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో ₹178.6 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారు.

News January 1, 2026

KCR అసెంబ్లీకి రావాలి.. ఎలాంటి ఆటంకం కలిగించం: సీఎం రేవంత్

image

TG: జల వివాదాలపై మాట్లాడేందుకు BRS చీఫ్, మాజీ సీఎం KCR అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు. ‘ఎవరి బాగు కోసం పాలమూరు ప్రాజెక్టు ఎత్తిపోతల సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. కమీషన్లు ఎవరికి వెళ్లాయి. దీనిపై విచారణ జరగాలి’ అని వ్యాఖ్యానించారు. అబద్ధాల పోటీలో KCR, KTR, హరీశ్ రావుకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నారు.