News October 11, 2024

తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రద్దు: పిడమర్తి రవి

image

తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి సంబంధించిన కమిటీని రద్దు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఛైర్మన్ ఇనుప ఉపేందర్, అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం, కన్వీనర్ MD రహీమ్ కూడిన కమిటీని వెంటనే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తదుపరి కమిటీని ప్రకటిస్తామని ఆయన వివరించారు.

Similar News

News March 24, 2026

RR: వాహనాల వేలానికి సిద్ధమైన ఆర్టీఏ

image

ఆర్టీఏ పరిధిలోని సీజ్డ్ వాహనాలను బహిరంగ వేలం వేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఆర్టీసీ డిపోల్లో ఏళ్లుగా పోగుపడిన వాహనాలతో పార్కింగ్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్& ఆర్టీఏ సెక్రటరీ సదానంద తెలిపారు. జాబితాలో పేర్లున్న వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు మార్చి 27లోపు అధికారుల నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకోవాలని ఆయన కోరారు.

News March 22, 2026

ఖైరతాబాద్‌: గంజాయి ముఠా గుట్టురట్టు!

image

ఖైరతాబాద్‌లోని M.S.మక్తాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను లేక్ పోలీస్, టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులుచేసి పట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి విక్రయిస్తున్న ముగ్గురి నిందితులను అరెస్ట్ చేయగా, వారినుంచి 1.4 కిలోల ఎండిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. దొరికిన వారిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.