News October 11, 2024

అద్దంకి: అమ్మవారికి 50 కిలోల లడ్డు సమర్పణ

image

అద్దంకి పట్టణంలో వేంచేసియున్న శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దేవస్థానం 53వ దసరా నవరాత్రులు సందర్భంగా.. 53 కిలోల లడ్డూను అద్దంకి పట్టణానికి చెందిన భక్తులు వూటుకూరి సుబ్బరామయ్య, వారి సోదరులు గురువారం అమ్మవారికి సమర్పించారు.

Similar News

News September 15, 2025

ప్రకాశంలో ఇంజినీర్ల అద్భుతానికి నిదర్శనం ఇదే!

image

ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నుంచి నంద్యాల వరకు 60 కి.మీ రహదారి ఉంది. ఇందులో 25 కి.మీ ప్రయాణం ఘాట్ రోడ్డులో ఉంటుంది. స్వాతంత్ర్యం రాకముందు నిర్మించిన రైల్వే పురాతన వంతెనల దిమ్మెలు నేటికీ కనిపిస్తున్నాయి. నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఈ ఘాట్ రోడ్డు అద్భుతమైన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇంజినీర్లు సృష్టించిన అద్భుతాలకు ఇదో ఉదాహరణ.

News September 15, 2025

మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన జిల్లా వాసే

image

నేడు ఇంజనీర్స్ డే. దేశమంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరిస్తుంది. ఇంజినీర్లందరూ ఆయనే ఆదర్శమని గర్వంగా చెబుతుంటారు. ఆయన జయంతి సందర్భంగానే ఇంజినీర్స్ డేను జరుపుకుంటారు. విశ్వేశ్వరయ్య పూర్వీకులు బి.పేట మండలంలోని మోక్షగుండం వాసులే. ఈయనను మోక్షగుండం ప్రజలు నేటికీ ఆరాధిస్తారు. ముంబై, పూణే, హైదరాబాద్‌లో వంతెనలు నిర్మించి వరదల నుంచి కాపాడిన ఘనత ఈయన సొంతం.

News September 15, 2025

పూర్వ ఎస్పీ దామోదర్‌కు ఘనంగా వీడ్కోలు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ దామోదర్‌కు వీడ్కోలు సభను జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్పీ దామోదర్ జిల్లాకు అందించిన సేవలను పలువురు పోలీస్ అధికారులు కొనియాడారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.