News October 11, 2024
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో గొట్టిపాటి లక్ష్మీ భేటీ

రాష్ట్ర ట్రాన్స్ పోర్టు & స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని దర్శి TDP ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శిలోని మినీ స్టేడియం ఇతరత్రా అంశాలపై మంత్రికి ఆమె వివరించారు. దర్శికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రిని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం మంత్రికి గౌతమ బుద్ధుడి ప్రతిమ బహూకరించారు.
Similar News
News December 28, 2025
ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగర్ జలాలు వచ్చేనా..?

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.
News December 28, 2025
తర్లుపాడు KGBV విద్యార్థులతో వంట పనులు

తర్లుపాడు మండలం కలుజువ్వులపాడు పంచాయతీలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్నట్లు ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలతో చపాతీలు చేయించడం, వంట సామాను కడిగించడం, గదులు శుభ్రంచేయించడం వంటి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు చెప్పాల్సిన సిబ్బంది పిల్లలతో చాకిరీ చేయించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 28, 2025
ప్రకాశం కలెక్టర్‌తో MLA ఉగ్ర భేటీ.!

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్‌తో ఆయన చర్చించారు. ఎమ్మెల్యే తెలిపిన అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధికి సంబంధించిన అంశాలకు తన వంతు సహకరిస్తానని తెలిపారు.


