News October 11, 2024
15న నేవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన
TG: వికారాబాద్ జిల్లా పరిగిలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఈ నెల 15న శంకుస్థాపన జరగనుంది. CM రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖలను కలిసి రాడార్ స్టేషన్ ప్రాజెక్టు అధికారులు శంకుస్థాపనకు ఆహ్వానించారు. దేశంలోనే 2వ రాడార్ స్టేషన్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వస్తుందని మంత్రి సురేఖ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అటు ఈ స్టేషన్ వద్దంటూ వామపక్షాలు, ప్రజాసంఘాలు ఇటీవల ఆందోళన చేశాయి.
Similar News
News January 2, 2025
VIRAL: తులం బంగారం రూ.113 మాత్రమే
ఏంటీ అవాక్కయ్యారా? ఇది నిజమే. 1959లో తులం బంగారం ధర 113 రూపాయలే. అంటే ఒక్క గ్రాముకు రూ.10 మాత్రమే. 60 ఏళ్ల క్రితం నాటి ఈ గోల్డ్ షాపు బిల్లును చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 60 ఏళ్లలో బంగారం ధర ఇన్ని రెట్లు పెరిగిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే రూ.78వేలు కావాల్సిందే. అప్పుడు బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కొనేందుకు డబ్బులు ఉండకపోయేవని పెద్దలు చెప్తుండేవారు.
News January 2, 2025
BSFపై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
చొరబాటుదారులు బెంగాల్‌లోకి ప్రవేశించేలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహకరిస్తోందని CM మమత ఆరోపించారు. BSF పరిధిలోని ఇస్లాంపుర్, సితాయ్, చోప్రా సరిహద్దుల నుంచి చొరబాటుదారుల్ని అనుమతిస్తున్నారని అన్నారు. తద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరిచి, ఆ నెపాన్ని తమపై నెడుతున్నారని ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో BSF అక్రమాలకు మద్దతిస్తూ తమను నిందించవద్దని రాజకీయ ప్రత్యర్థులకు సూచించారు.
News January 2, 2025
కోటి మందికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్: లోకేశ్
AP: కోటి మంది TDP కార్యకర్తలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలతో MOU కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. ‘తొలివిడతగా పార్టీ తరఫున రూ.42 కోట్లు చెల్లించాం. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా కల్పించేలా ఒప్పందం కుదుర్చుకున్నాం. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.