News October 11, 2024

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక వ్యాఖ్యలు

image

TG: దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 9 కల్లా రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కులగణనకు బీసీ సంఘాలు సహకరించాలని కోరారు.

Similar News

News December 22, 2024

ఆ వస్తువులపై 1% ఫ్లడ్ సెస్ విధించాలి: మంత్రి పయ్యావుల

image

AP: GST విధానంలో మార్పులు, చేర్పులపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు. ‘5శాతానికి మించి శ్లాబులో ఉన్న వస్తువులపై 1% ఫ్లడ్ సెస్ విధించాలి. ఈ సెస్‌తో వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడతాం. రేషన్ ద్వారా వచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై GST సుంకం తగ్గించాలి. IGST వ్యవస్థను పారదర్శకంగా చేపట్టాలి. రాష్ట్రాలకూ డేటా అందుబాటులో ఉండేలా చూడాలి’ అని జైసల్మేర్‌లో జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో మంత్రి అన్నారు.

News December 21, 2024

నిద్రలో ఎందుకు కలవరిస్తారంటే?

image

కొందరు నిద్రలోనే మాట్లాడుతుంటారు. కొంతమంది గొణగడం చేస్తే, మరికొందరు స్పష్టంగా గట్టిగా కలవరిస్తుంటారు. 3 నుంచి పదేళ్ల మధ్య ఉన్న పిల్లలు, కొందరు పెద్దలు నిద్రలో మాట్లాడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం తాము చేసిన పని గురించి, కలలతో సంబంధం ఉన్నా, కొన్ని రకాల మందులు వాడినా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలా ప్రవర్తిస్తారు. కొందరికి జన్యుపరంగా కూడా ఈ అలవాటు వస్తుంది.

News December 21, 2024

ఇన్సూరెన్సులు కట్టేవారికి నో రిలీఫ్

image

హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులు ప్రీమియంలపై జీఎస్టీ భారం తగ్గనుందనే ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దీనిపై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా ఇన్సూరెన్సుల ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని తగ్గించనున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా నిర్మల ప్రకటనతో క్లయింట్లకు నిరాశే ఎదురైంది.