News October 11, 2024

FLASH: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

దసరా ముంగిట హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.760 పెరిగి రూ.77,400 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.700 ఎగసి రూ.70,950కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పెరగడంతో రూ.1,02,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Similar News

News February 9, 2026

నలుగురు లెక్చరర్లు.. రూ.4 లక్షల జీతం.. ఒక్కరే విద్యార్థి

image

AP: విద్యావ్యవస్థలో సరైన ప్రణాళిక, ముందుచూపు, కార్యాచరణ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిపే ఘటన ఇది. ఏలూరు(D) ముసునూరు ZP స్కూల్‌లో ఏర్పాటైన జూనియర్ కాలేజీలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి ఉండగా, పాఠాలు చెప్పడానికి నలుగురు లెక్చరర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా ₹4L జీతం చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News February 9, 2026

నరదిష్టి నివారణ పూజ

image

విజయప్రాప్తి, సకల శుభాలు కలగాలంటే నరదిష్టి నివారణ పూజ ఎంతో ప్రయోజనకరం. ఈ పూజతో ఇతరుల అసూయ, నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ శాస్త్రోక్త పూజతో అనారోగ్యాలు తొలగి, మానసిక శాంతి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ రక్షణ చేకూరుతాయి. మీ పేరు, గోత్రంతో నిర్వహించే ఈ పూజ పూర్తి వీడియో రికార్డ్‌ను మీ వాట్సాప్‌కు పంపిస్తాము. ఆటంకాలను తొలగించుకోవడానికి వేదమందిర్‌లో ఇప్పుడే పూజ <>బుక్ చేసుకోండి.<<>>

News February 9, 2026

T20 WC: అత్యధిక వికెట్లు తీసింది వీరే..

image

T20WCలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్(50) తొలి స్థానంలో ఉన్నారు. నిన్న ఐర్లాండ్‌తో మ్యాచులో 3 వికెట్లు తీసిన హసరంగ(40*) తర్వాతి స్థానంలో ఉన్నారు. అఫ్రీది(39), మలింగ(38), రషీద్(38*), జంపా(36), అజ్మల్(36), సౌథీ(36), నోర్ట్జే(35), మెండిస్(35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి అశ్విన్(32), అర్ష్‌దీప్(29), బుమ్రా(26) టాప్ వికెట్ టేకర్లుగా ఉన్నారు.