News October 11, 2024
మందు బాబులపై ‘రౌండాఫ్’ భారం

AP: నూతన లిక్కర్ పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీల వసూలుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ విధానంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉదాహరణకు మద్యం బాటిల్ ధర ₹150, ₹200 ఉంటే యథాతథంగా ఉంచుతారు. ఆ రేటుకు అర్ధరూపాయి ఎక్కువున్నా రౌండాఫ్ చేసి ₹160, ₹210 వసూలు చేస్తారు. ఒకవేళ సీసా ధర ₹90.5 ఉంటే రౌండాఫ్ ₹99 చేస్తారు. రూ.99కే నాణ్యమైన క్వార్టర్ మద్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News January 13, 2026
తిరుపతి: భార్య పోలీస్.. భర్త దొంగ!

నెల్లూరులో కార్ల <<18838353>>దొంగతనం <<>>వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఓ కారు షోరూమ్‌లో పనిచేసే లక్ష్మణ్ కుమార్, కారు మెకానిక్ శివ(నెల్లూరు బీవీనగర్), A1 నిందితుడు ఫ్రెండ్స్. ఢిల్లీ, ముంబయిలో A1 కార్లు చోరీ చేసి నెల్లూరుకు తెస్తే ఈ ఇద్దరూ AP, TS నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ రేటుకు అమ్మేస్తున్నారు. A1 నెల్లూరుకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ భర్త అని.. అతనిపై చాలా కేసులు ఉన్నట్లు సమాచారం.
News January 13, 2026
‘స్కిల్’ కేసు.. అప్పుడు ఏం జరిగిందంటే?

AP: 2014-19లో <<18842559>>స్కిల్<<>> డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట అప్పటి TDP ప్రభుత్వం రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడిందని గత YCP గవర్నమెంట్ ఆరోపించింది. ఈక్రమంలోనే 2023 సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. CBNకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 53 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
News January 13, 2026
తిరుమల: శ్రీవారి దర్శనానికి ఎంత టైమ్ పడుతోందంటే?

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 68,542 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా.. 22,372 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.98 కోట్లు ఆదాయం వచ్చిందని TTD వెల్లడించింది.


