News October 11, 2024

చిల్లకూరులో కన్న తల్లిని కడతేర్చిన కొడుకు

image

కన్న తల్లిని కన్న కొడుకే కడతేర్చిన ఘటన చిల్లకూరు మండలం, కమ్మవారిపాలెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గ్రామంలో కాపురముంటున్న సుశీలమ్మ కొడుకు మద్యం తాగొచ్చాడని మందలించింది. ఈ నేపథ్యంలో ఆవేశంతో కత్తితో కుమారుడు తల్లి తల మీద నరికాడు. వెంటనే గూడూరు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మహిళ మృతి చెందింది. ఘటనపై చిల్లకూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News December 30, 2024

2024లో మారిన నెల్లూరు రాజకీయ ముఖచిత్రం

image

2024లో సార్వత్రిక ఎన్నికలు నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. నెల్లూరు MP సీటుతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో TDP గెలిచింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచిన YCP 2024 ఎన్నికల్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. సూళ్లూరుపేట నుంచి విజయశ్రీ, ఉదయగిరి నుంచి కాకర్ల సురేశ్, కోవూరు నుంచి ప్రశాంతి రెడ్డి, కావలి నుంచి కృష్ణారెడ్డి మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

News December 30, 2024

నెల్లూరు: ఆనాటి గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు ఎక్కడ..?

image

నెల్లూరు జిల్లాలో కొత్త సంవత్సరం అంటే అందరూ జొన్నవాడ, నరసింహకొండ, పెంచలకోన అంటూ తమకు నచ్చిన గుడికి వెళ్తుంటారు. ఆ తర్వాత ఆత్మీయుల కోసం గ్రీటింగ్ కార్డు కొనుగోలు చేసి మనసులోని భావాలను ఆ కార్డుపై రాసి పంపేవారు. నేడు పరిస్థితి మారింది. గుడికి వెళ్లడం కొనసాగుతున్నా.. గ్రీటింగ్ కార్డులు మాయమయ్యాయి. మొబైల్ ఫోన్ల రాకతో అర్ధరాత్రి 12 మోగగానే మెసేజ్‌లు, కాల్స్‌తో విషెస్ చెబుతున్నారు.  

News December 30, 2024

నెల్లూరులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు: నుడా ఛైర్మన్

image

నెల్లూరు నగరంలో తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆదివారం స్టోన్ హౌస్ పేటలోని పాండురంగ అన్నదాన సమాజంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి కృషి చేశామని ఆయన అన్నారు.