News October 11, 2024

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: లోకేశ్

image

AP: పంటలు పండని అనంతపురంలో కార్లు పరిగెత్తించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళగిరిలో కియా షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడిన్ ఆంధ్రా అంటున్నారు. CBN విజన్ ఉన్న నాయకుడు. TCSను ఒప్పించి పెట్టుబడులు తేవడమే కాదు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. చిన్న పరిశ్రమలనూ ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.

Similar News

News February 4, 2026

డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’

image

AP: డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. సచివాలయంలో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్‌ కోసం వివిధ లోగోలు, పేర్లను CM పరిశీలించారు. ‘‘స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తులను తయారు చేస్తున్నందున ‘స్వయం’ అనే పేరు బాగుంటుంది. లోగో కూడా అదే డిజైన్‌తో ఉండాలి’’ అని సూచించారు. బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఉండాలన్నారు.

News February 4, 2026

DANGER: పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా?

image

బిర్యానీతో పాటు పచ్చి ఉల్లిపాయలు కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది కదా. కానీ వాటిని సరిగా శుభ్రం చేయకపోతే గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, సిస్టిక్ సిర్రోసిస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అలాగే గుండెల్లో మంట, నోటి దుర్వాసన వస్తాయి. కాబట్టి వీటిని తినే ముందు శుభ్రంగా కడిగి తినాలి. వీటిని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News February 4, 2026

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

image

UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను <>క్లిక్<<>> చేయండి. SHARE IT