News October 11, 2024
సిరిమానోత్సవంపై కలెక్టర్ సమీక్ష

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అన్ని సంప్రదాయాలను పాటిస్తూ భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా నిర్వహించాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌లో అమ్మవారి పండగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అమ్మవారి సిరిమాను వద్ద పని చేసే సిబ్బంది 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ప్రారంభం అయ్యేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 5 గంటలలోగా జాతర పూర్తవ్వాలన్నారు.
Similar News
News March 13, 2026
అధిక వడ్డీలతో వేదిస్తే కఠిన చర్యలు: VZM ఎస్పీ

అధిక వడ్డీలతో ప్రజలను వేదిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎస్పీ దామోదర్ గురువారం హెచ్చరించారు. కాల్ మనీ పేరుతో వేధింపులకు పాల్పడిన, అధిక వడ్డీలు వసూలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేరే జిల్లాలకు చెందిన వ్యక్తులు జిల్లాకు వచ్చి ప్రజల అవసరాలను గుర్తించి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వేదిస్తున్నట్లు తెలిసిందని, అటువంటి వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
News March 12, 2026
జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు: జేసీ

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలు అవాస్తవమన్నారు. గ్యాస్ బుకింగ్‌కు 25 రోజుల గడువు మాత్రమే ఉంటుందని, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.
News March 12, 2026
రైతుల ఖాతాల్లో రూ.127.63 కోట్లు జమ: VZM కలెక్టర్

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం మూడవ విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఒక్కో రైతుకు రూ.6,000 చొప్పున అందించనున్నారు. జిల్లాలో 2,27,700 మంది రైతులకు సుమారు రూ.127.63 కోట్లు జమ కానున్నాయని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ నిధులను రైతులు పంట సాగు అవసరాలకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.


