News October 11, 2024

తల్లి లేదు.. రాదు.. పాపం ఆ పిల్లలకు అది తెలియదు!

image

ఆ తల్లి కుక్క ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దానికి పాలు తాగే నాలుగు పిల్లలున్నాయి. తమ తల్లి ప్రాణాలతో లేదన్న విషయం అన్నెం పున్నెం తెలియని ఆ పిల్లలకు తెలిసే దారేది? అప్పటి వరకూ ఆడుకుని అలసిపోయి వచ్చాయి. అమ్మ లేస్తుందని, పాలిస్తుందని చూశాయి. ఎంతసేపటికీ తల్లి లేవకపోవడంతో దీనంగా దాని చెంతనే నిద్రపోయాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం చూపరులను కదిలించింది.

Similar News

News January 2, 2025

BSFపై మ‌మ‌తా బెనర్జీ తీవ్ర ఆరోప‌ణ‌లు

image

చొర‌బాటుదారులు బెంగాల్‌లోకి ప్ర‌వేశించేలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స‌హ‌క‌రిస్తోంద‌ని CM మ‌మ‌త ఆరోపించారు. BSF పరిధిలోని ఇస్లాంపుర్‌, సితాయ్‌, చోప్రా స‌రిహ‌ద్దుల నుంచి చొర‌బాటుదారుల్ని అనుమ‌తిస్తున్నార‌ని అన్నారు. త‌ద్వారా రాష్ట్రాన్ని అస్థిర‌ప‌రిచి, ఆ నెపాన్ని త‌మ‌పై నెడుతున్నారని ఘాటుగా స్పందించారు. ఈ విష‌యంలో BSF అక్ర‌మాల‌కు మ‌ద్ద‌తిస్తూ త‌మ‌ను నిందించ‌వ‌ద్ద‌ని రాజకీయ ప్రత్యర్థులకు సూచించారు.

News January 2, 2025

కోటి మందికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్: లోకేశ్

image

AP: కోటి మంది TDP కార్యకర్తలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలతో MOU కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. ‘తొలివిడతగా పార్టీ తరఫున రూ.42 కోట్లు చెల్లించాం. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా కల్పించేలా ఒప్పందం కుదుర్చుకున్నాం. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News January 2, 2025

దీప్తి ఎవరో తెలుసా?

image

TG: పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించిన అథ్లెట్ జివాంజి దీప్తికి కేంద్రం <<15045760>>అర్జున అవార్డును<<>> ప్రకటించింది. WGL కల్లెడకు చెందిన దీప్తి చిన్నతనం నుంచే మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బందిపడ్డారు. కోచ్ రమేశ్ ఆమెలోని టాలెంట్‌ను గుర్తించి హైదరాబాద్ తీసుకొచ్చి శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో ప్రపంచ వేదికల్లో సత్తాచాటారు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్ దీప్తి.