News October 11, 2024
వరదల్లో జగన్ అడుగు బయటపెట్టలేదు: లోకేశ్
AP: చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో పేరుందని వారు భయపడుతున్నారన్నారు. వరదలొచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టలేదని, ఇప్పుడు వరద సాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 22, 2024
లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు కేంద్రం షాక్.!
లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను సర్కారు రూపొందించింది. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం ఇక కుదరదు.
News December 22, 2024
వన్డే సిరీస్‌పై కన్నేసిన భారత్
విండీస్‌పై టీ20 సిరీస్ గెలిచిన జోరుమీదున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌పై కన్నేసింది. నేడు కరేబియన్ జట్టుతో తొలి వన్డేలో తలపడనుంది. బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్, స్మృతి, జెమీమా, రిచా, బౌలింగులో దీప్తి, రేణుక, సైమా నిలకడగా రాణిస్తుండటం టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశాలు. మరోవైపు వన్డేల్లోనైనా గెలవాలని విండీస్ పట్టుదలతో ఉంది. మ.1.30 నుంచి స్పోర్ట్స్-18లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
News December 22, 2024
ఆ చిన్నారుల సమస్యకు శాశ్వత పరిష్కారం: లోకేశ్
AP: YSR(D) కొర్రపాడులో స్కూల్ దుస్థితిపై WAY2NEWS రాసిన <<14938798>>కథనానికి<<>> మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ప్రస్తుతం రేకుల షెడ్డులో నడుస్తున్న ఆ పాఠశాలలో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. సత్వరమే మరమ్మతులు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించాను. పునాదుల్లో నిలిచిపోయిన స్కూలు భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం’ అని ట్వీట్ చేశారు.