News October 11, 2024
గోపీచంద్ ‘విశ్వం’ REVIEW

మంత్రి హత్యను చూసిన ఓ పాప ప్రాణాలను రక్షించేందుకు గోపీరెడ్డి అలియాస్ విశ్వం రంగంలోకి దిగుతాడు. అసలు ఈ విశ్వం ఎవరు, ఎందుకు పాపను రక్షిస్తున్నాడు అన్నది బ్యాలెన్స్ కథ. గోపీచంద్ తన పాత్రను అలవోకగా పోషించారు. నరేశ్, ప్రగతి, పృథ్వీరాజ్, వెన్నెల కిషోర్ కామెడీ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో కథను హడావుడిగా చుట్టేయడమే మైనస్. శ్రీను వైట్ల గత 3 సినిమాలతో పోలిస్తే ‘విశ్వం’ బాగుందని చెప్పొచ్చు.
రేటింగ్: 2.25/5
Similar News
News January 29, 2026
పోలీసు సేవకు సలాం చెప్పాల్సిందే!

అందరూ కుటుంబంతో మేడారం జాతరకు వెళ్తే పోలీసులు మాత్రం మన కోసం కుటుంబాన్ని వదిలి పహారా కాస్తున్నారు. నేడు సమ్మక్క తల్లి గద్దెపైకి రానున్న తరుణంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఒక్క చిన్న ప్రమాదం, పొరపాటు కూడా జరగకుండా వారు అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రమశిక్షణతో మహాజాతరను శాంతియుతంగా పూర్తి చేసుకుందాం. పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుదాం.
News January 29, 2026
కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. ఆయనకు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తదుపరి విచారణ తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్ మరోసారి నోటీసులు ఇస్తుందా? ఎప్పుడు, ఎక్కడ విచారిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. తనను ఎర్రవల్లిలోనే <<18996095>>ప్రశ్నించాలని<<>> కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.
News January 29, 2026
నెలకు ₹5 లక్షల మేకప్.. పోలీసులకే షాకిచ్చిన ‘గ్లామరస్’ దొంగ

బెంగళూరులో ఓ ‘గ్లామరస్’ దొంగ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. భక్తి ముసుగులో గుళ్లు, రద్దీ ప్రదేశాల్లో బంగారాన్ని కాజేస్తున్న గాయత్రి, ఆమె భర్త శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ₹60 లక్షల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. సంపన్న మహిళగా కనిపిస్తే ఎవరూ గుర్తించరని.. అందుకోసం నెలకు ₹4-5 లక్షలు కేవలం మేకప్ కోసమే ఖర్చు చేస్తానని ఆమె అంగీకరించడం పోలీసులను షాక్‌కు గురిచేసింది.


