News October 11, 2024

గ్రూప్-3 ఉద్యోగాల భర్తీపై BIG UPDATE

image

తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల తేదీలను TGPSC ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో OMR విధానంలో పేపర్-1,2,3 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందవచ్చని వెల్లడించింది. ఇప్పటికే శాంపిల్ OMR ఆన్సర్ షీటును వెబ్‌సైటులో అందుబాటులో ఉంచామంది.

Similar News

News November 6, 2025

IMMTలో 30 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(<>IMMT<<>>)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించింది. అర్హతగల అభ్యర్థులు NOV 21 వరకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్, Sr సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, ఎంటెక్, BE, బీటెక్ , PhD ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.immt.res.in/

News November 6, 2025

కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

image

కోయంబత్తూరు <<18187183>>గ్యాంగ్ రేప్<<>> బాధితురాలిపై DMK మిత్రపక్ష MLA ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 11.30గం.కు మహిళ, పురుషుడు చీకట్లో ఉండటం వల్ల కలిగే అనర్థాలను ఆపేదెలాగని అన్నారు. వీటిని పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని చెప్పారు. పేరెంట్స్ పెంపకం, టీచర్లతోనే మార్పు వస్తుందని పేర్కొన్నారు. దీంతో నిందితులను ఒక్కమాట అనకుండా బాధితురాలిని తప్పుబట్టడమేంటని BJP నేత అన్నామలై మండిపడ్డారు.

News November 6, 2025

పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

image

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.