News October 11, 2024
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేజ్రీవాల్

అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీలను సగానికి తగ్గిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వరకు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే BJP తరఫున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ ఇటీవల సవాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.
Similar News
News February 20, 2026
టెన్త్ స్టూడెంట్ల పేర్లలో తప్పుల సవరణకు ఛాన్స్

AP: టెన్త్ విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, జెండర్ వివరాల్లో తప్పులుంటే స్కూళ్ల ఐడీల ద్వారా HMలు ఈనెల 21లోపు సరిచేయాలని బోర్డు సూచించింది. బోర్డు అందించే లింకుల్లో వీటిని సమర్పించాలంది. కరెక్షన్స్‌ను విద్యార్థులు, పేరెంట్స్ కూడా సరిచూసుకోవాలని పేర్కొంది. ఈ పరీక్షలకు 6 లక్షల మంది హాజరుకానున్నారు.
News February 20, 2026
ఆస్తి పంపకాలలో వాస్తు సూచనలు

కుటుంబంలో ఆస్తి పంపకాలప్పుడు మనస్పర్థలు రాకుండా ఉండేందుకు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు కొన్ని సూచనలు చేశారు. అవి.. ఖాళీ స్థలాల విభజనలో తూర్పు, ఉత్తరం దిశల్లో చిన్నవారు ఉండాలి. పడమర, దక్షిణం దిశల్లో పెద్దవారు ఉండాలి. ఈ పద్ధతిని అనుసరిస్తే సోదరుల మధ్య ఐక్యత దెబ్బతినదు. ఇలా శాస్త్రోక్తంగా దిశలు కేటాయిస్తే అనవసర తగాదాల తగ్గుతాయి. ఇలా కుటుంబంలో ప్రశాంతతను, ఆర్థికాభివృద్ధిని పెంపొందించుకోవచ్చు. <<-se>>#Vasthu<<>>
News February 20, 2026
‘ఒకే గ్రూప్‌లో టాప్ టీమ్సా?’.. ప్రీసీడింగ్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి

టీ20 ప్రపంచకప్‌లోని ప్రీసీడింగ్ పద్ధతిపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టేబుల్ టాపర్స్‌గా నిలిచిన ఇండియా, జింబాబ్వే, విండీస్, సౌతాఫ్రికా ఓకే గ్రూప్‌లో ఉండటం సరికాదంటున్నారు. కాగా మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లు, టికెట్ల అందుబాటులో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రీసీడింగ్ పద్ధతిని 2024లో ICC తీసుకొచ్చింది. క్వాలిఫైడ్ జట్లకు గ్రూప్ స్టేజ్‌లో, సూపర్-8లో నిర్ణీత స్లాట్లను ICC కేటాయిస్తోంది.


