News October 11, 2024

నందిగం సురేశ్‌కు అస్వస్థత

image

AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌‌కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 11, 2024

ఆ మ్యాచ్‌కి భారత జట్టు కెప్టెన్ ఎవరు?

image

ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో మొద‌టి రెండు మ్యాచ్‌ల‌లో ఒక‌దానికి కెప్టెన్ <<14326057>>రోహిత్ శ‌ర్మ గైర్హాజ‌ర‌య్యే<<>> అవ‌కాశం ఉండ‌డంతో ఆ మ్యాచ్‌కి సారథ్యం వ‌హించేది ఎవ‌ర‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మ‌న్ గిల్‌, రిష‌భ్ పంత్‌ల‌లో ఒకరికి కెప్టెన్‌గా ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. AUS లాంటి బలమైన జట్టుతో మ్యాచ్ కాబట్టి మళ్లీ కోహ్లీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.

News October 11, 2024

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలపై జీవో జారీ

image

TG: పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను శనివారం నాటికి ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్/ కార్పొరేటర్ ఛైర్మన్‌గా కమిటీలను ఏర్పాటు చేయాలంది. పంచాయతీ కార్యదర్శి/ వార్డు ఆఫీసర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని GOలో పేర్కొంది. SHG గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో ఉంటారు.

News October 11, 2024

ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు మొత్తం 90 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ద్వారా రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ నెల 14న లాటరీ తీసి విజేతలను నిర్ణయిస్తారు. 15నాటికి దుకాణాన్ని వారికి అప్పగిస్తారు. 16 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. కాగా రాష్ట్రంలో 3,396 వైన్ షాపులు ఉన్నాయి.