News October 11, 2024

రాత్రి 7గంటలకు ముగియనున్న లిక్కర్ షాపుల దరఖాస్తు గడువు

image

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఈరోజు రాత్రితో ముగియనుంది. రాత్రి 7గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు, 12 గంటల్లోపు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశముంది. బ్యాంకు DDలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అప్లై చేసుకోవచ్చు. కాగా నిన్న రాత్రి 8గంటల వరకు 65,629 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో 20 దరఖాస్తులు అమెరికా నుంచి రావడం గమనార్హం. నాన్ రిఫండబుల్ ఫీజు రూపంలో రూ.1312.58 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.

Similar News

News November 4, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

* TG: 1,037 ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ G.O. జారీ. 2026 మార్చి 31 వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను కోరిన సీఎం రేవంత్
* సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను సహించం: ఏపీ హోంమంత్రి అనిత
* మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని TG సర్కార్ ఆదేశం

News November 4, 2025

APPLY NOW: NRDCలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<>NRDC<<>>)3 అసిస్టెంట్ మేనేజర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ/ఎంటెక్, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://www.nrdcindia.com

News November 4, 2025

క్లాసెన్‌ను రిలీజ్ చేయనున్న SRH?

image

IPL: వచ్చే నెలలో జరిగే మినీ ఆక్షన్‌కు ముందు స్టార్ బ్యాటర్ క్లాసెన్‌ను SRH రిలీజ్ చేసే అవకాశం ఉందని ToI పేర్కొంది. ఇతడి కోసం పలు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని తెలిపింది. గత మెగా వేలానికి ముందు రూ.23 కోట్లతో క్లాసెన్‌ను ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకుంది. అతడిని రిలీజ్ చేస్తే వచ్చే డబ్బుతో మంచి బౌలింగ్ అటాక్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో జట్టును బ్యాలెన్స్ చేసుకోవచ్చని SRH భావిస్తున్నట్లు సమాచారం.