News October 11, 2024

EPFOలో కీలక మార్పులకు సిద్ధమైన కేంద్రం?

image

ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మధ్య తరగతి వర్గాలకు మరింత లబ్ధి చేకూర్చేలా మార్పులు చేస్తున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఇందులో కనీస పెన్షన్ పరిమితి రూ.1000 నుంచి పెంచడం, పదవీ విరమణ సమయంలో పెన్షన్ ఫండ్ నుంచి పాక్షిక ఉపసంహరణలకు అనుమతి, సులభంగా నగదు విత్ డ్రా, నెలవారీ ఆదాయం రూ.15వేల కంటే ఎక్కువగా ఉన్నవారికి పెన్షన్ పథకాన్ని విస్తరించడం వంటివి ఉన్నాయి.

Similar News

News October 11, 2024

జగన్‌పై కోపం లడ్డూపై చూపించారు: నారాయణ

image

AP: జగన్‌పై ఉన్న కోపాన్ని కూటమి సర్కార్ తిరుమల లడ్డూపై చూపించిందని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఈ అంశం RSSకు రాజకీయంగా ఉపయోగపడిందన్నారు. గత ప్రభుత్వం మద్యంలో హోల్‌సేల్‌గా దోచుకుందని మండిపడ్డారు. ఇప్పుడు TDP, YCP సిండికేట్‌గా మారి అరాచకం చేయబోతున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు.

News October 11, 2024

మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

image

TG: మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ విద్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గవర్నమెంట్ టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు. మీరు చెప్పే విద్యపై మీకే నమ్మకం లేదా? ప్రభుత్వ టీచర్లు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లలోనే చేర్పించాలి’ అని వ్యాఖ్యానించారు. అన్ని కులాలు, మతాల విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై మీ కామెంట్?

News October 11, 2024

తెలంగాణకు వచ్చేస్తున్న అకున్ సభర్వాల్

image

TG: సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన ఐటీబీపీ ఐజీగా పని చేస్తున్నారు. కాగా 2017లో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసును అకున్ సభర్వాల్ పర్యవేక్షించారు. కేసు కీలక దశలో ఉన్నప్పుడు ఆయన కేంద్రానికి వెళ్లిపోవడంతో డ్రగ్స్ కేసు మరుగునపడింది. మళ్లీ ఇప్పుడు ఆయనకు ఏ పోస్ట్ ఇస్తారోనని చర్చ జరుగుతోంది.