News October 11, 2024

ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ ఇదే: ఏకంగా కి.మీపైనే!

image

సౌదీలోని జెడ్డాలో ‘జెడ్డా ఎకనమిక్ టవర్స్’ పేరుతో 1,007 మీటర్ల ఎత్తైన భవనం నిర్మిస్తున్నారు. ఇందులో 157 అంతస్తులు, 59 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. లగ్జరీ అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆఫీసులు నిర్మిస్తున్నారు. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ఈఫిల్ టవర్‌, లోఖండ్‌వాలా మినర్వాకు 3 రెట్లు, అంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు రెట్టింపు ఎత్తు ఉండనుంది. గతంలో పనులు ఆగిపోగా మళ్లీ ప్రారంభమయ్యాయి.

Similar News

News October 11, 2024

మెగాస్టార్‌తో విక్టరీ వెంకటేశ్: పిక్స్ వైరల్

image

‘విశ్వంభర’ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవిని హీరో దగ్గుబాటి వెంకటేశ్ కలిశారు. ఆయనతోపాటు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కూడా చిరును కలిసి సందడి చేశారు. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకీ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీజర్ రేపు ఉదయం హైదరాబాద్‌లోని మైత్రీ విమల్ థియేటర్‌లో విడుదల కానుంది.

News October 11, 2024

జగన్‌పై కోపం లడ్డూపై చూపించారు: నారాయణ

image

AP: జగన్‌పై ఉన్న కోపాన్ని కూటమి సర్కార్ తిరుమల లడ్డూపై చూపించిందని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఈ అంశం RSSకు రాజకీయంగా ఉపయోగపడిందన్నారు. గత ప్రభుత్వం మద్యంలో హోల్‌సేల్‌గా దోచుకుందని మండిపడ్డారు. ఇప్పుడు TDP, YCP సిండికేట్‌గా మారి అరాచకం చేయబోతున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు.

News October 11, 2024

మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

image

TG: మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ విద్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గవర్నమెంట్ టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు. మీరు చెప్పే విద్యపై మీకే నమ్మకం లేదా? ప్రభుత్వ టీచర్లు తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లలోనే చేర్పించాలి’ అని వ్యాఖ్యానించారు. అన్ని కులాలు, మతాల విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై మీ కామెంట్?