News October 11, 2024
దేవర-2పై డైరెక్టర్ క్రేజీ కామెంట్స్
దేవర-2లో నటీనటులపై డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఉంటే బాగుంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అది జరుగుతుందో లేదో తెలియదన్నారు. బాలీవుడ్ స్టార్లను అతిథి పాత్రలకు తీసుకోవడం తనకు ఇష్టముండదని, ముఖ్యమైన క్యారెక్టర్‌లే ఇస్తానని పేర్కొన్నారు. నటించబోయే వారి వివరాలను త్వరలోనే పాత్రలవారీగా వెల్లడిస్తామని తెలిపారు.
Similar News
News December 22, 2024
FEB 28 వరకు పీసీ ఘోష్ కమిషన్ గడువు
TG: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం నాలుగోసారి పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు అవకాశమిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లలో సమస్యలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
News December 22, 2024
రాష్ట్రానికి తప్పిన ముప్పు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు IMD వెల్లడించింది. దీంతో రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు తప్పినట్లేనని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 55Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
News December 22, 2024
లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు కేంద్రం షాక్.!
లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను సర్కారు రూపొందించింది. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం ఇక కుదరదు.